టెనెట్ మళ్లీ వాయిదా పడింది

Tenet

హాలీవుడ్ చిత్రం “టెనెట్” మరోసారి వాయిదాపడింది. ఎన్నో సినిమాలు వాయిదా పడుతున్నాయి… పర్టిక్యూలర్ గా ఈ సినిమా గురించి మేము ఎందుకు రాస్తున్నాం అని డౌట్ పడుతున్నారా? ఇది మామూలు సినిమా కాదు. “ది డార్క్ నైట్”, “ఇన్ సెప్షన్”, “ఇంటర్ స్టెల్లార్” వంటి గొప్ప బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన కొత్త సినిమా ఇది.

“టెనెట్ ” ట్రైలర్ కూడా అదిరింది. ఐతే అన్నింటా కన్నా ముఖ్యం.. కరోనా కారణంగా హాలీవుడ్ సినిమాలు అన్ని వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈ పెద్ద సినిమా కూడా ఈ ఇయర్ రిలీజ్ కావు. కానీ నోలన్ మాత్రం ….తన సినిమాని వచ్చే ఇయర్ కి వాయిదా వేసేందుకు ఒప్పుకోలేదు. ఈ జులైలోనే సినిమాని రిలీజ్ చేస్తా అని పట్టుబడుతున్నారు. కానీ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేసిన నోలన్ …తాజాగా జులై నుంచి సినిమాని ఆగస్టు కి మార్చారు.

ఆగస్టు 12న విడుదల కానుంది అని చెప్తున్నారు. ఈ సినిమా గనుక థియేటర్ లో రిలీజ్ అయితే… జనం చూసేందుకు ఎగబడితే… ఇక ప్రపంచవ్యాప్తంగా సినిమా పరిశ్రమలకు ఒక ఊపు వస్తుంది. అందుకే హాలీవుడ్ అనే కాదు మన దేశంలోని నిర్మాతలు, బయ్యర్లు కూడా “టెనెట్” ఫేట్ ఎలా ఉంటుంది అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సినిమా రిలీజ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది.

Related Stories