కొత్త పెళ్ళికూతురికి కరోనా భయం

Niharika

హనీమూన్ ట్రిప్ నుంచి రాగానే నిహారిక ఒక కొత్త వెబ్ సిరీస్ ని ఒప్పుకొంది. అంతేకాదు, ఆ వెబ్ సిరీస్ లాంచ్ కార్యక్రమంలో కూడా పాల్గొంది. అదే ఇప్పుడు ఆమెని టెన్షన్ లో పడేసింది. ఈ ఓపెనింగ్ కార్యక్రమం రెండు రోజుల క్రితమే జరిగింది. ఈ ఈవెంట్ కి నటి అనసూయ కూడా విచ్చేసింది. ఐతే, ఈ రోజు (జనవరి 10) అనసూయకి కరోనా లక్షణాలు భయటపడ్డాయిట. ఆమె ఈ విషయాన్నీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమెకి కరోనా వచ్చిందా లేదా అన్నది ఇంకా టెస్ట్ లో తేలలేదు.

కానీ ఇప్పుడు నిహారిక, ఆమె భర్త చైతన్య కూడా కొద్దిరోజులు ఐసొలేషన్ లో ఉండాలి. లక్షణాలు వెంటనే బయటపడవు కదా. సో ఏమవుతుందో అన్న టెన్షన్ నిహారికకి తప్పదు మరో నాలుగైదు రోజులు.

నిహారిక పెళ్లి గత నెలలోనే జరిగింది. ఆమె సోదరుడు వరుణ్ కి కూడా ఇటీవల కరోనా సోకింది. ఐతే, అతను కోలుకున్నాడు. ఇప్పుడు ఈ కొత్త పెళ్ళికూతురికి అనసూయ రూపంలో టెన్షన్ మొదలయింది.

More

Related Stories