
తమన్-సిద్ శ్రీరామ్.. ఈ కాంబినేషన్ పేరు చెప్పగానే “సామజవరగమన” అనే సాంగ్ ఠక్కున గుర్తొస్తుంది. “అల వైకుంఠపురములో” సినిమాలోని ఈ పాట సూపర్ డూపర్ హిట్టయింది. ఈ సాంగ్ తర్వాత ఈ కాంబినేషన్ పై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టు ఈరోజు రిలీజైంది మరో సాంగ్.
“సోలో బ్రతుకే సో బెటరు” సినిమా నుంచి ‘హే ఇది నేనేనా’ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. తమన్ కంపోజ్ చేసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. “సామజవరగమన” రేంజ్ లో ఈ పాట క్లిక్ అవుతుందా లేదా అనే విషయాన్ని అప్పుడే చెప్పలేం కానీ ఈ పాట కూడా బాగుంది.
నిజానికి ఈ రెండు సాంగ్స్ మధ్యలో తమన్-సిద్ శ్రీరామ్ కాంబోలో మరో సాంగ్ కూడా వచ్చింది. పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో “మగువా” అనే పాటను కూడా సిద్ శ్రీరామే పాడాడు. కాకపోతే అది రొమాంటిక్ నంబర్ కాదు.
‘సోలో బ్రతుకే..” సినిమాలో సిద్ పాడింది రొమాంటిక్ సాంగ్. పైగా మేల్ వెర్షన్ కూడా కావడంతో “సామజవరగమన” సాంగ్ తో దీనికి పోలిక మొదలైంది.