
శంకర్ సినిమాకి సంగీతం అందించడమే అంటే థమన్ తన రేంజ్ ని అమాంతం పెంచుకున్నట్లే. శంకర్ మన దేశంలో టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. ఆయన ఇప్పటివరకు ఏ ఆర్ రెహమాన్, హరీష్ జైరాజ్ లతోనే వర్క్ చేశారు. అనిరుధ్ తో ‘భారతీయుడు 2’ ప్రకటించినా అది ఆగిపోయింది. ఆ లెక్కన చూస్తే, శంకర్ సినిమాలకు సంగీతం అందిస్తున్న మూడో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాత్రమే.
కీరవాణి, మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్ వంటి సీనియర్ తెలుగు సంగీత దర్శకులకు దక్కని గౌరవం తమన్ కి దక్కింది. ‘తొలి ప్రేమ’ సినిమా నుంచి తన సంగీత శైలి మార్చేయడం తమన్ కి బాగా ప్లస్ అయింది. ఆ సినిమా పాటల వల్లే తమన్ త్రివిక్రమ్ క్యాంప్ లోకి అడుగుపెట్టి ‘అరవింద సామెత’, ‘అల వైకుంఠపురంలో’ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చారు.
ఇప్పుడు మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’, మహేష్ బాబు – త్రివిక్రమ్ కొత్త చిత్రం, పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి మూవీ, ‘అఖండ’ వంటి భారీ చిత్రాలకు పనిచేస్తున్నారు తమన్.
మిగతా సినిమాలు వేరు … శంకర్ సినిమా వేరు. శంకర్ ప్రతి సినిమా… మ్యూజికల్ హిట్టే. పాటలను భారీగా తీసే దర్శకుల్లో ఒకరు శంకర్. సో.. థమన్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళింది ఇప్పుడు.
రామ్ చరణ్ హీరోగా శంకర్ తీస్తున్న ఈ భారీ చిత్రానికి తెలుగు సాకేంతిక నిపుణులే ఎక్కువగా పనిచేయనున్నారు.