
‘సర్కారు వారి పాట’ మొదటి పాట ఈ నెల 14న విడుదల చెయ్యాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. అలా ప్రొమోషన్ షురూ చేశారు. కానీ ఆల్రెడీ అది లీక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బయటికి వచ్చిన పాట చూసి టీం షాక్ తిన్నది. ముఖ్యంగా తమన్ బాధ పడుతున్నాడు. ఆరు నెలల పాటు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయింది అని వర్రీ అవుతున్నాడు.
ఈ పాట హై క్వాలిటీతో విడుదల చేసినప్పుడు జనం వింటే బాగుండేది…!
“గుండె అంతా తరుక్కుపోతోంది. హార్ట్ బ్రేకింగ్. జనరల్ గా నేను హార్ట్ బ్రేక్ అవ్వను. జీవితంలో ఎన్నో చూశాను. కానీ ఇది చాలా బాధేసింది. ఎంతో మంది వర్క్ చేశారు ఈ లిరికల్ వీడియో కోసం. మా టీం తరఫున ఫ్యాన్స్ కి సారి చెప్తున్నా,” అని తమన్ ఒక ఆడియో నోటు పెట్టాడు.
పని కోసం పాట ఇస్తే…. ఒకతను లీక్ చేశాడట. “కమాన్ కమాన్ కళావతి…” అనే ఈ పాటని సిద్ శ్రీరామ్ పాడాడు. తమన్, సిద్ శ్రీరామ్ పై సాంగ్ ని ప్రత్యేకంగా చిత్రీకరించి ఈ లిరికల్ వీడియోని షూట్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత తమన్ మహేష్ బాబు సినిమాకి వర్క్ చేస్తున్నాడు.