తమన్: నా డ్రీం నెరవేరింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి పాటలు అందించడం తమన్ కి ఒక కల. ఆ డ్రీం ‘‘వకీల్ సాబ్’’తో నెరవేరింది. వచ్చేనెల 9న విడుదల కానుంది “వకీల్ సాబ్”. మీడియాతో తన అనుభూతులను పంచుకున్నాడు.

“జనసేన సాంగ్స్ చేసినప్పటి నుంచి కళ్యాణ్ గారితో అనుబంధం ఏర్పడింది. త్రివిక్రమ్ గారు నన్ను దిల్ రాజు గారికి పరిచయం చెయ్యడంతో వకీల్ సాబ్ కు మ్యూజిక్ చేసే అవకాశం లభించింది.డైరెక్టర్ శ్రీరామ్ వేణు కథ చెప్పగానే ‘‘మగువ మగువ’’ ట్యూన్ చేశాను. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా హైలెట్ అవుతుంది,” అని అన్నాడు తమన్.

“పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేస్తే చాలు అనుకున్నాను కానీ ఇప్పుడు ఆయనతో ఇంకో సినిమా చెయ్యబోతున్నాను. సాగర్ చంద్ర దర్శకత్వంలో “అయ్యప్పన్ కోషియం” రీమేక్ మూవీకి కూడా పాటలు నేనే కంపోజ్ చేస్తున్నాను.సత్యమేవ జయతే సాంగ్ వినిపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాగా ఎక్సయిట్ అయ్యారు. మగువ మగువ సాంగ్ కూడా ఆయనకు బాగా నచ్చింది.”

ఈ సమ్మర్ లో తమన్ కంపోజ్ చేసిన “టక్ జగదీష్” బాలయ్య -బోయపాటి శ్రీను సినిమాలు కూడా విడుదల కానున్నాయి.

More

Related Stories