తమన్ మోత మోగిస్తున్నాడుగా

- Advertisement -
Thaman

తమన్ ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. అతని ఖాతాలో అన్నీ పెద్ద చిత్రాలే. ‘మాస్’ సినిమాలకు సంగీతం అందించడంలో అతని కిక్ వేరుగా ఉంటుంది అనిపిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘క్రాక్’ సినిమాకి తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ అయింది. ఇప్పుడు ‘అఖండ’ విషయంలో కూడా అదే జరిగింది.

‘అఖండ’ విజయంలో తమన్ ది పెద్ద పాత్ర. ఎందుకంటే ఈ సినిమా ద్వితీయార్ధంలో పెద్దగా కథలేదు. ఫైట్స్ మోత ఎక్కువ. మరి అలాంటి ఫైట్స్ ని జనం చూసేలా చెయ్యాలంటే నేపథ్య సంగీతమే ముఖ్యం. ఆ విషయంలో తమన్ మోత మోగించారు. పాటల విషయంలో నిరాశపర్చిన బ్యాగ్రౌండ్ లో మాత్రం బుల్డోజర్ బండిలా కుమ్మి కుమ్మి పారేశారనే చెప్పాలి.

తదుపరి బాలయ్య చిత్రానికి కూడా తమనే బాణీలు సమకూర్చనున్నారు. ప్రస్తుతం అతని చేతిలో మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’, మహేష్ బాబు – త్రివిక్రమ్ చిత్రం, పవన్ ‘కళ్యాణ్ భీమ్లా నాయక్’, రామ్ చరణ్ – శంకర్ మూవీ వంటివి ఉన్నాయి.

ఐతే, పెద్ద సినిమాల మోజులో చిన్న చిత్రాలకు మాత్రం తమన్ సరిగా సంగీతం ఇవ్వడం లేదని ఆరోపణ. ఇటీవల ‘టక్ జగదీష్’ సినిమాకి సరైన పాటలు ఇవ్వలేదు. నేపథ్య సంగీతం కూడా తమన్ తో కాకుండా గోపిసుందర్ తో చేయించుకున్నారు.

 

More

Related Stories