నాగ చైతన్యకి పెద్ద భారమే!

- Advertisement -
Thandel

నాగ చైతన్య ఇటీవల విజయం చూడలేదు. శేఖర్ కమ్ముల తీసిన “లవ్ స్టోరీ” మాత్రమే హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన “థాంక్యూ”, “లాల్ సింగ్ చద్దా”, “కస్టడీ” దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అలాగే, అమెజాన్ కోసం చేసిన వెబ్ సిరీస్ “ధూత”ని జనం అప్పుడే మర్చిపోయారు. సో ఆయన కెరీర్ బ్రైట్ గా లేదు.

అయినా కూడా నాగ చైతన్యతో భారీ సినిమాని నిర్మిస్తోంది GA2 పిక్షర్స్ సంస్థ. “తండేల్” పేరుతో నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా “కార్తీకేయ 2” ఫేమ్ చందూ మొండేటి డైరెక్షన్ లో భారీ సినిమాని నిర్మిస్తోంది ఆ సంస్థ. చైతన్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ ని ప్లాన్ చేసి మొదలు పెట్టింది సంస్థ.

ఐతే, బడ్జెట్ అంచనాలు దాటి ఖర్చు పెరిగిపోతోందట.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు సగం పూర్తి అయింది. కానీ మొత్తం పూర్తి అయ్యేసరికి అనుకున్న బడ్జెట్ కి మించి భారీగా ఖర్చు అయ్యేలా ఉందట. పెద్ద సంస్థ తీస్తున్న సినిమా కాబట్టి ఫైనాన్స్ కి ఢోకా లేదు. కానీ లాభాలు రావాలంటే ఈ సినిమా భారీగా హిట్ కావాలి. అది నాగ చైతన్యకి పెద్ద భారమే. అతను పాన్ ఇండియా లెవల్లో భారీ ఓపెనింగ్ తీసుకురాగలడా అనేది చూడాలి.

 

More

Related Stories