‘థాంక్యూ’ మోస్తరు లుక్


ఈ రోజు నాగ చైతన్య పుట్టిన రోజు. బర్త్ డే స్పెషల్ గా నాగ చైతన్య నటించిన రెండు సినిమాల మొదటి లుక్కులు వచ్చాయి. రెండూ సో సోగానే ఉన్నాయి.

పొద్దున ‘బంగార్రాజు’ సినిమా నుంచి చైతన్య టీజర్ వచ్చింది. గోదావరి కుర్రాడిలా కనిపించాడు. సాయంత్రం ‘థాంక్యూ’ ఫస్ట్ లుక్ ఫోటో వచ్చింది. కళ్లద్దాలు పెట్టుకొని సిటీబాయ్ లుక్ లో స్మార్ట్ గా ఉన్నాడు. ఫస్ట్ లుక్ చూడగానే వావ్ అనిపించాలి. కానీ, ఈ రెండు చిత్రాలు ఆ విషయంలో ఫెయిల్ అయ్యాయి.

‘థాంక్యూ’ చిత్రానికి దర్శకుడు విక్రమ్ కుమార్. ‘మనం’ వంటి సూపర్ మూవీ తీసిన దర్శకుడు ఆయన. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొంది. వచ్చే వేసవిలో విడుదల కానుంది ఈ మూవీ. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ ఏడాది నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ విజయం అందుకున్నాడు. ఇక వ్యక్తిగత జీవితంలో భార్య సమంత నుంచి విడిపోయాడు.

Thank You Movie Glimpse | Naga Chaitanya, Raashi Khanna | Thaman S | Vikram K Kumar | Dil Raju
 

More

Related Stories