
దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇప్పుడు సోషల్ మీడియాలో బిజీ. ఆయన డైరెక్షన్ గురించి జనం మాట్లాడుకొని చాలా కాలమే అవుతోంది. “పెళ్లి చూపులు”, “ఈ నగరానికి ఏమైంది”… ఈ రెండు చిత్రాలు మాత్రమే తీశారు ఇప్పటివరకు. వెంకటేష్ తో అనుకున్న మూవీ అటకెక్కింది. నాగ చైతన్యతో ప్లాన్ చేసిన సినిమా వర్క్ అవుట్ కాలేదు.
టీవీ యాంకర్ గా, నటుడిగా మాత్రం ఈ మధ్య బిజీ అయ్యారనే చెప్పాలి. అలాగే, 33 ఏళ్ల ఈ కుర్ర దర్శకుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక సమస్య నుంచి కూడా బయటపడ్డాడట. దాంతో, ఇప్పుడు ఫుల్లుగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన సోషల్ మీడియా టైంలైన్ చూస్తే అర్థమవుతోంది.
తరుణ్ భాస్కర్ ఇప్పుడు రెగ్యులర్ గా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. హీరోలు, హీరోయిన్లు ఫోటోషూట్ల ఫోటోలు షేర్ చేస్తారు కదా. ఈ దర్శకుడు అలాగే చేస్తున్నారు. బహుశా తరుణ్ అలాంటి ఇమేజ్ కోరుకుంటున్నారేమో! ఆఫ్ స్క్రీన్ కన్నా తెరపై కనిపించి ఆ స్టార్డం కోసం తాపత్రయపడుతున్నట్లు కనిపిస్తోంది.
తరుణ్ భాస్కర్ తన కొత్త సినిమా ప్రకటన గురించి ఊసే ఎత్తడం లేదు. ఆ మధ్య ‘పిట్టకథలు’ అనే ఒక పిట్ట చిత్రం తీశారు. అంతే.