అవును సినిమాలో ఆ పాట లేదు

Deepika Padukone in Fighter

హృతిక్ రోషన్, దీపిక పదుకోన్ నటించిన “ఫైటర్” సినిమా విడుదలైంది. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తోంది. ఈ సినిమాకి సాధారణ ఓపెనింగ్ వచ్చింది మొదటి రోజు. ఇక ఈ వీకెండ్ వసూళ్లు పుంజుకోవాలి.

మరోవైపు, ఈ సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చింది. రివ్యూస్, రేటింగ్స్ కూడా అలాగే ఉన్నాయి.

మరోవైపు, ఈ సినిమాలో బాగా సూపర్ హిట్టైన “ఇష్క్ జైసా కుచ్” అనే పాట లేదు. సెన్సార్ అభ్యంతరంతో ముందే పాట తీసేశారు. దీపిక,హృతిక్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి. కానీ ఈ పాట లేకుండానే సినిమాని రిలీజ్ చేశారు.

ఈ పాటలో దీపిక పదుకోన్ తన బికినీ అందాలను యథేచ్ఛగా ప్రదర్శించారు. కొన్ని శృంగార పరమైన డ్యాన్స్ స్టెప్స్ వేశారు. ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన సైనికురాలి పాత్ర. అలాంటి ఉద్దాత్త పాత్రలో అసభ్యంగా నృత్యాలు చేస్తున్నట్టు చూపించడం సబబు కాదని సెన్సార్ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో, సినిమాలో పెట్టలేదు.

Advertisement
 

More

Related Stories