
మెగా కాంపౌండ్ హీరోల మధ్య కూడా లుకలుకలున్నాయంటూ గిట్టని వారు రకరకాల ప్రచారాలు చేస్తుంటారు. కానీ ఎప్పటికప్పుడు తమ అనుబంధాన్ని బయటపెడుతూనే ఉన్నారు ఈ హీరోలు. మరీ ముఖ్యంగా బన్నీ-చరణ్ మధ్య అనుబంధంపై చాలామందికి అనుమానాలున్నాయి. అలాంటి డౌట్స్ కు సమాధానంగా వచ్చింది ఓ చిన్న వీడియో.
నిన్న రాత్రి నిహారిక ఎంగేజ్ మెంట్ జరిగింది. దీనికి అల్లు అర్జున్, రామ్ చరణ్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ముందు వరుసలో నాగబాబు, ఆయన వియ్యంకుడు కూర్చున్నారు. చరణ్ రావడానికంటే ముందే బన్నీ ఆ లైన్లో కూర్చున్నాడు. అయితే ఉపాసనతో పాటు వచ్చిన చరణ్ మాత్రం ముందు వరుసలో కూర్చోడానికి ఇష్టపడలేదు. తనను చూసి నిల్చున్న నాగబాబును ఆయన సీట్లోనే కూర్చోబెడుతూ.. రెండో వరుసలో తను సెటిల్ అయ్యాడు.
ఇదంతా చూసిన బన్నీ వెంటనే చరణ్ దగ్గరకొచ్చాడు. ఫ్రంట్ కు రమ్మని చేయిపట్టుకొని లాగాడు. కానీ చరణ్ మాత్రం ఒప్పుకోలేదు. దీంతో బన్నీ కూడా తన సీటు నుంచి లేచి, రెండో వరుసలో చరణ్ పక్కన కుర్చీ వేసుకొని కూర్చున్నాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో… మెగాఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ను కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది.