లాక్డౌన్ లో తీసిన ‘ది ఛేజ్’

thechase

సందీప్ కిషన్ హీరోగా ‘‘నిను వీడను నీడను నేనే’ థ్రిల్లర్ తీసిన దర్శకుడు కార్తీక్ రాజా లాక్డౌన్ టైములో మరో సినిమా తీశాడు. ఈ సినిమా పేరు…. “ది ఛేజ్”. కార్తీక్ ప్రస్తుతం రెజీనా తో ‘‘నేనే నా’’ అనే మరో సినిమా తెరకెక్కిస్తున్నారు.. ఐతే ఈ మూవీ విడుదలకు లాక్డౌన్ అడ్డంకిగా మారింది.

ఈ గ్యాప్ లో ‘‘రైజా విల్సన్’’ మెయిన్ లీడ్ గా ‘‘ది చేజ్’’ అనే తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీని రూపొందించాడు.

అనసూయ ఈ మూవీలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయడం విశేషం.

“మా టీమ్ అంతా కలిసి ఈ లాక్ డౌన్ లో ఏదైనా క్రియేటివ్ గా ప్లాన్ చేయాలనుకొని ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించాం. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూనే తక్కువ మందితో షూట్ చేశా. హిల్ స్టేషన్ లో షూట్ చేశాం.సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.ఇది ఓ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ.ఓ తల్లీ, కూతురు ఇంకో టీనేజర్ మధ్య సాగే కథ. చాలా ట్విస్టులతో ఉత్కంఠ గా సాగుతుంది,” అన్నారు డైరెక్టర్

కార్తీ నటించిన ‘‘ఖైదీ’’ మూవీలో హీరో కూతురి గా నటించిన మోనిక ఇందులో ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది.

Related Stories