వెయిటింగ్ పీరియడ్ పెరుగుతోంది!

సమంత ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. ఆమె తన ‘యశోద’ సినిమా ప్రొమోషన్ కోసం కూడా బయటికి రాలేదు. యాంకర్ సుమని పిలిపించుకొని ఒక ఇంటర్వ్యూ చేసింది. అదొక్కటే ఆమె చేసిన ప్రొమోషన్. ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా బయటికి రావాలంటే మరో నెల పడుతుందట.

సమంత అనారోగ్యం కారణంగా ఆమె హీరోయిన్ గా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా షూటింగ్ మూడు నెలలుగా నిలిచిపోయింది. మరో నెల పాటు అంతే. దాంతో విజయ్ దేవరకొండ పని లేకుండా ఖాళీగా కూర్చున్నాడు. ఆమె ఎప్పుడు వస్తుందా అని నిరీక్షిస్తున్నాడు.

‘లైగర్’ ఆగస్టులో విడుదలైంది. అప్పటి నుంచి దేవరకొండ ఖాళీనే. ‘లైగర్’ కోసం రెండేళ్ల టైం కేటాయిస్తే ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. ఇప్పుడు ‘ఖుషి’ ఆలస్యం అవుతోంది.

ఐతే, సమంత మాత్రం తాను ఏమాత్రం బలం సంపాదించుకున్నా షూటింగ్ కి వస్తాను అని మాటిచ్చిందట. తన వల్ల సినిమా టీం సఫర్ అవుతోందని ఆమె బాధపడుతోంది.

 

More

Related Stories