సమంత వెబ్ సిరీస్ సమ్మర్ కి వాయిదా!

Samantha

‘ది ఫ్యామిలీ మ్యాన్’..,సెకండ్ సీజన్ అనుకున్నట్లుగానే వాయిదా పడింది. ఈ నెల 12న స్ట్రీమింగ్ కావాల్సిన ఈ వెబ్ సిరీస్ రాజకీయ వివాదాల నేపథ్యంలో పోస్ట్ పోన్ అయింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా టీం ప్రకటించింది. మనోజ్ బాజ్పాయ్ హీరోగా నటించిన ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ సూపర్ హిట్. రెండో సీజన్ లో సమంత కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే సమంత ఈ సీజన్ ని బాగా ప్రోమోట్ చేసింది.

ఇటీవల ‘తాండవ్’, మీర్జాపూర్’ వెబ్ డ్రామాలని బీజేపీ, దాని అనుబంధ సంఘాలు వివాదాస్పదం చేశాయి. యూపీలో అరాచకం ఏలుతుందన్నట్లుగా ఈ వెబ్ సిరీసులున్నాయని యూపీ ప్రభుత్వం ఈ మేకర్స్ పై కేసులు కూడా వేసింది. కోర్టుల్లో కూడా ఈ డ్రామాల మేకర్స్ కి రిలీఫ్ దక్కలేదు. దాంతో…’ది ఫ్యామిలీ మ్యాన్ 2′ మేకర్స్ భయపడ్డారనేది టాక్.

ఎందుకొచ్చిన తంటా అని ఇప్పుడు ఇందులో కొన్ని ఇబ్బందికర సన్నివేశాలను తొలగించి మళ్ళీ రీషూట్ చేస్తున్నారట. అంటే సమంత మళ్ళీ ఈ సిరీస్ లో యాక్ట్ చెయ్యాలి.

More

Related Stories