
రాజమౌళి తీసిన ‘ఆర్ ఆర్ ఆర్’ మొదట విడుదల కావాల్సిన తేదీ గుర్తుందా? జులై 30, 2020న విడుదల చేస్తానని ప్రకటించారు రాజమౌళి. కానీ కరోనా కారణంగా కుదరలేదు. దాంతో, జనవరి 8, 2021 అని ఒకేసారి, అక్టోబర్ 13, 2021 అని మరోసారి, ఆ తర్వాత జనవరి 7, 2022 అని ప్రకటించారు. జనవరి 7, 2022కి ఫిక్స్ అయి ట్రైలర్ విడుదల చేసి, సినిమాకి విపరీతమైన ప్రచారం కూడా చేశారు. కానీ కరోనా మూడో వేవ్ కారణంగా వాయిదా వెయ్యాల్సి వచ్చింది.
ఐతే, పది రోజుల క్రితమే ఈ సినిమాకి కొత్త డేట్స్ ఇవే అంటూ ఒక ప్రకటన ఇచ్చారు. మార్చి 18 కానీ, ఏప్రిల్ 28న కానీ విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పుడు మార్చి 25 అంటూ ఇంకో డేట్ ప్రకటిస్తూ అనౌన్సమెంట్ వచ్చింది. ఆ వెనువెంటనే, “ఆచార్య” టీం, “భీమ్లానాయక్” టీం, “ఎఫ్ 3” టీం తమ డేట్స్ వెల్లడించాయి.
అంటే… విడుదల తేదీల ప్రకటన అనే ప్రహసనం మళ్ళీ మొదలవుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇందులో ఎన్ని చెప్పిన డేట్ కి కట్టుబడి ఉంటాయి అనేది చూడాలి.
ఇప్పటివరకు ప్రకటనలను బట్టి చూస్తే….
భీమ్లానాయక్ – ఫిబ్రవరి 25 కానీ ఏప్రిల్ 1
రాధేశ్యామ్ – మార్చి 11
ఆర్ ఆర్ ఆర్ – మార్చి 25
ఎఫ్ 3 – ఏప్రిల్ 28
ఆచార్య – ఏప్రిల్ 29