కర్నూలులో ఘోస్ట్

చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమా ఈవెంట్ అనంతపూర్ లో జరగనుంది. దాంతో, నాగార్జున కూడా తన సినిమా ఈవెంట్ ని రాయలసీమలోనే నిర్వహిస్తున్నారు. నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ… ‘ది ఘోస్ట్’.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా జరగనుంది. కర్నూలులోని ఎస్టీబీసీ మైదానం ఈ వేడుకకు వేదికైంది. అలా రాయలసీమలోని కర్నూల్ నగరాన్ని నాగ్ సెలెక్ట్ చేశారు.

దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది ‘ది ఘోస్ట్’. విడుదలైన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. పూర్తిగా స్టయిలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈమూవీ ప్రమోషన్ల విషయంలో దూకుడుగా ఉంది.

నాగార్జున సరసన సోనాల్ చౌహన్ నటించింది. యాక్షన్ తో పాటు గ్లామర్ డోస్ కూడా ఉంది ఈ సినిమాలో.

 

More

Related Stories