దూత కథ ఇదే!

- Advertisement -
Dootha

“దూత” అనే వెబ్ సిరీస్ లో నాగ చైతన్య నటిస్తున్న వార్త పాతదే. ఈ వెబ్ సిరీస్ గురించి అధికారికంగా అమెజాన్ ఈ రోజు ప్రకటించింది. అమెజాన్ సంస్థ ఈ ఏడాది అనేక ఇండియన్ వెబ్ సిరీసులు, సినిమాలు నిర్మిస్తోంది. వాటి వివరాలు తాజాగా తెలిపింది.

‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ లో నాగ చైతన్య హీరో. ఇది ఒక సూపర్ నేచురల్ హారర్ డ్రామా. అంటే దయ్యాల కథ అన్నమాట. “ఈ కథలో దెయ్యాలు ఆవహించిన కొన్ని వస్తువులు ఘోరమైన పాపాలు చేసిన వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తాయి,” అని అమెజాన్ ప్రకటించింది. అదే స్థూల కథ అన్నమాట.

నాగ చైతన్య ఒక మెసెంజర్ గా (అంటే దెయ్యాలు, మనుషులకు మధ్య ఉండే వ్యక్తి) కనిపిస్తాడని భావించొచ్చు. నాగ చైతన్యతో పాటు ప్రియా భవాని శంకర్, పార్వతి, ప్రాచి దేశాయి, తరుణ్ భాస్కర్ కూడా నటించారు.

ఈ వెబ్ సిరీస్ లోని కొన్ని ఫోటోలను కూడా అమెజాన్ విడుదల చేసింది.

 

More

Related Stories