హ్యాండ్సమ్ హీరో అసలు బిజినెస్

Dulquer Salmaan

దుల్కర్ సల్మాన్.. టోటల్ సౌత్ లో పాపులర్ అయిన హీరో. మమ్ముట్టి తనయుడిగా అతడి ఎంట్రీ ఈజీగానే జరిగిపోయింది. ఆ తర్వాత క్రేజ్ తెచ్చుకోవడానికి మాత్రం చాలా కష్టపడ్డాడు. అయితే చాలామంది “నెపోకిడ్స్”లా దుల్కర్ చటుక్కున హీరో అయిపోలేదు. చాలా రంగాల్లో తన లక్ చెక్ చేసుకున్నాడు. ఆ తర్వాతే ఇండస్ట్రీలోకి వచ్చాడు.

అమెరికాలో బిజినెస్ మేనేజ్ మెంట్ చేసిన ఈ హీరో, సినిమాల్లోకి రాకముందు ఓ వెబ్ సైట్ పెట్టాడు. ఆ పోర్టల్ ద్వారా కార్లు అమ్మడం, కొనడం లాంటివి చేసేవాడు. ఈ బిజినెస్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్లాడట దుల్కర్. ఆ తర్వాత  దాన్ని వేరే వ్యక్తుల చేతిలో పెట్టాడు. తమ బిజినెస్ చూసిన తర్వాత.. ఆన్ లైన్ కార్లు అమ్మకాలు-కొనుగోళ్లకు సంబంధించి చాలా సైట్లు వచ్చాయంటున్నాడు.

కేవలం ఇది మాత్రమే కాదు..తన చదువుకు తగ్గట్టు దుబాయ్ లో కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీల్లో వర్క్ చేశాడు దుల్కర్. ఆ తర్వాత అదే సాఫ్ట్ వేర్ కంపెనీల్లో బిజినెస్ పార్టనర్ గా కూడా ఎదిగాడు. వీటితో పాటు బెంగళూరులోని ఓ హాస్పిటల్ కు డైరక్టర్ గా వ్యవహరించాడు.

తను ఏ బిజినెస్ చేసినా దానికి సంబంధించి ఓ బ్రాంచ్ ను చెన్నైలో ఏర్పాటుచేసేవాడట దుల్కర్. తను చదువుకున్న ఊరు కావడంతో చెన్నై అంటే తనకు చాలా ఇష్టం అంటున్నాడు ఈ హీరో. ఇలా సినిమాల్లోకి రాకముందు చాలా వ్యాపారాలు చేసి, అంతిమంగా సినిమాల్లోకి వచ్చాడు.

తన లైఫ్ రొటీన్ అయిపోయిందని, మొనాటనీ వచ్చేసిందని అందుకే అన్నీ వదిలేసి సినిమాల్లోకి వచ్చానని ఓపెన్ గా చెబుతుంటాడు ఈ హీరో.

Advertisement
 

More

Related Stories