గుండుబాస్ వెనుక బిగ్ బాస్

chiranjeevi

ఇది తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్

నిన్న మెగాస్టార్ చిరంజీవి ‘గుండు’తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వెల్, మెగాస్టార్ గుండు చేయించుకోలేదు. “గుండు”లో ఎలా ఉంటానో చూసుకుందామనే ముచ్చటపడ్డారు చిరంజీవి. దాంతో “ప్రొస్థెటిక్ మేకప్” వేయించుకున్నారు.

దీని వెనుక ఒక కథ ఉంది…

“బిగ్ బాస్ తెలుగు 4” ప్రోమో కోసం నాగార్జునని ముసలి గెటప్ లో చూపించేందుకు ముంబై నుంచి ఒక మేకప్ టీం దిగింది. నాగార్జునని ముసలి గెటప్ లో చూపించాలంటే… విగ్గు పెట్టాలి. దానికన్నా ముందుగా “గుండు” చెయ్యాలి. అంటే “గుండు”లా అనిపించే ప్రొస్థెటిక్ మేకప్ వేస్తారు. నాగార్జునని అలా గుండులో చూసి తను కూడా ముచ్చటపడ్డాడు చిరంజీవి. దాంతో, నాగార్జున అదే టీంని చిరంజీవి దగ్గరికి పంపారు. వాళ్ళు ఇలా “గుండు” బాస్ ప్రోస్తెటిక్ మేకప్ వేశారు. దాంతో చిరంజీవి ఈ ఫోటో తీసి మనకి షేర్ చేశారు.

త్వరలో తాను చెయ్యబోయే ఒక సినిమాలో ప్రోస్తెటిక్ మేకప్ ఈ టీమ్ తోనే చేయించుకోవాలని బాస్ ఫిక్స్ అయ్యాడట.

Related Stories