సుకుమార్ సీరియస్ కావడంతోనే!

Sukumar and Buchibabu


‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు ‘పుష్ప 2’ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నట్లుగా మీడియాలో వచ్చిన వార్తలు అతని కొంపముంచాయి. దర్శకుడు సుకుమార్ చాలా సీరియస్ అయినట్లు టాక్.

ఫేస్ బుక్ లో ఈ ఫోటోలను పోస్ట్ చేశారు బుచ్చిబాబు స్నేహితుడు, సుకుమార్ టీం మెంబర్. ఐతే, ఆయన స్క్రిప్ట్ వర్కులో ఉన్నట్లు పెట్టారు కానీ ‘పుష్ప 2’ వర్క్ అని కానీ, బుచ్చిబాబు కొత్త సినిమా కోసం జరుగుతున్న కసరత్తు అని కానీ రాయలేదు.

ఆ ఫోటోలు చూస్తే మాత్రం ‘పుష్ప 2’ కోసం అన్నట్లుగా అనిపించడంతో మీడియా అదే రాసింది. ఐతే, సుకుమార్ కి ‘పుష్ప 2’ స్క్రిప్ట్ లాక్ చెయ్యడంలో ఇబ్బంది అవుతోందని, అతని శిష్యుడి సహాయం తీసుకున్నాడన్నట్లుగా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ప్రసారం చెయ్యడంతో సుకుమార్ టీం అలర్ట్ అయింది. వెంటనే, బుచ్చిబాబు వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

“మాగురువుగారు సుకుమార్ Sir నా కోసం నా సినిమా కథ కోసం Help చేయడానికి వచ్చారు. సుకుమార్ Sir సినిమా కథలో కూర్చుని Discussion చేసేంత స్థాయి నాకు లేదు రాదు. ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడమే తప్ప , ఆయనకి ఇచ్చేంత లేదు,” అని పోస్ట్ చేశారు.

NTR and Buchi Babu

నిజం కూడా అదేనంట. బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథని మరింత పకడ్బందీగా, పెద్ద హీరో స్థాయికి తగ్గట్లుగా మలిచేలా సుకుమార్ హెల్ప్ చేస్తున్నాడట.

 

More

Related Stories