‘సలార్’ వాయిదాకి కారణమిదే!

- Advertisement -
Prabhas and Prashanth Neel

ఊహించినట్లే ప్రభాస్ నటిస్తున్న “సలార్” వాయిదా పడింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ని ఆగస్టులో విడుదల చేస్తామని నిర్మాతలు ఇంతకుముందు ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. సెప్టెంబర్ మూడున ట్రైలర్ వస్తుంది అని కొత్తగా ప్రచారం జరిగింది. ఐనా నిర్మాతలు మౌనం వహించారు. దాంతో, ఈ సినిమా విడుదల సెప్టెంబర్ లో ఉంటుందా అని చాలామందిలో డౌట్స్ మొదలయ్యాయి.

దానికి తగ్గట్లే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడిందని కన్ ఫర్మ్ అయింది.

“సలార్” సడెన్ గా పోస్ట్ పోన్ కావడానికి కారణం ఉంది. ఈ సినిమా గ్రాఫిక్స్ పనులు పూర్తి కాలేదు. గ్రాఫిక్స్ ఎప్పటికీ పూర్తి అయ్యాయి అనేది క్లారిటీ వచ్చాకే కొత్త డేట్ ప్రకటిస్తారు. సెప్టెంబర్ 15 వరకు కూడా పూర్తి అవుతాయనే నమ్మకం లేదు.

“సలార్”ని గ్లోబల్ స్థాయిలో అయుదు భాషల్లో విడుదల చెయ్యాలని ప్లాన్ చేసిన సంగతి మనకు తెలుసు. సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున అనేక భాషల్లో విడుదల చెయ్యాలంటే సెప్టెంబర్ 15 నాటికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చెయ్యాలి.

అంటే 15 రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ పూర్తి చెయ్యాలి. అది సాధ్యం కాదు. అందుకే విడుదలని వాయిదా వేశారట.

రేపో, ఎల్లుండో అధికారిక ప్రకటన రానుంది. దాంతో, “సలార్” కొత్త విడుదల తేదీ తెలుస్తుంది. ఈ సినిమా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఈ సినిమా విడుదలని బట్టి ప్రభాస్ నటిస్తున్న ఇతర చిత్రాల – “కల్కి”, “రాజా” – విడుదల తేదీలను ఫిక్స్ చేస్తారు.

 

More

Related Stories