ఈ కారవాన్ మినీ స్వీట్

టాలీవుడ్ హీరోల్లో లగ్జరీ కారవాన్ అల్లు అర్జున్ దగ్గర ఉంది. దాన్ని తలదన్నేలా.. ఇంకా చెప్పాలంటే ఆ కారవాన్ ఓ మినీ స్టార్ హోటల్ లా మహేష్ బాబు కారవాం రూపుదిద్దుకొంది. దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి హీరో మహేష్ బాబు ఈ వ్యానిటీ వ్యాన్ తెప్పించాడు. మహేష్ టేస్ట్ కు తగ్గట్టు సర్వ హంగులు ఇందులో ఉన్నాయి.

ఇటీవలే ఇది హైదరాబాద్ కి వచ్చింది. దీన్నే మహేష్ బాబు ప్రస్తుతం ఉపయోగిస్తున్నాడు.

బెడ్ రూమ్, బాత్ రూమ్, కిచెన్, సోఫా సెట్, రివాల్వింగ్ ఛెయిర్, టీవీ వంటివి అన్ని రెగ్యులర్ గా ఉండే సదుపాయాలతో పాటు అల్ట్రా టెక్నాలాజీతో కూడిన గాడ్జెట్స్, స్టార్ హోటళ్లలో ఉండే ఇంటీరియర్ ఈ కారవన్లో ఉన్నాయి. ఇందులోకి అడుగుపెడితే…. స్టార్ట్ హోటళ్లలోని లగ్జరీ స్వీట్ (Suit ) రూమ్ తీసుకున్న భావన కలుగుతుందట. మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

More

Related Stories