శ్రావణికి, అశోక్ రెడ్డికి లింక్ ఇలా!

sravani kondapalli

టీవీ సీరియల్ నటి శ్రావణి మరణం కేసు అనేక మలుపులు తిరిగింది. ఫైనల్ గా పోలీసులు పక్కాగా విచారణ చేపట్టి దేవరాజ్‌రెడ్డి, రెండో నిందితుడు సాయికృష్ణారెడ్డిలను అరెస్టు చేశారు. ఈ కేసులో మూడో నిందితుడు నిర్మాత అశోక్ రెడ్డి. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇంతకీ అశోక్ రెడ్డి ఎవరు? అతనికి, టీవీ సీరియల్ నటికి లింక్ ఎలా కుదిరింది? లెట్స్ హవె లుక్…

సినిమాలపై ఆసక్తితో కాకినాడ నుంచి ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది శ్రావణి. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న టైంలోనే అనంతపురంకి చెందిన సాయికృష్ణ రెడ్డి పరిచయం అయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. 2018 వరకు శ్రావణి, సాయికృష్ణ రిలేషన్ లో ఉన్నారు. అతనితో రిలేషన్ లో ఉన్న టైంలోనే అశోక్ రెడ్డి పరిచయం అయ్యాడు.

నిర్మాత అశోక్ రెడ్డి తన బంధువు కార్తికేయని హీరోగా పరిచయం చేస్తూ “ప్రేమతో మీ కార్తిక్” (“ఆర్.ఎక్స్. 100” కార్తికేయ మొదటి సినిమా ఇది) అనే సినిమా తీశాడు. ఆ సినిమాలో చిన్న పాత్రలో నటించింది శ్రావణి కొండపల్లి. ఆ టైములో అశోక్ రెడ్డితో పరిచయం అయింది. అప్పటినుంచి అశోక్ రెడ్డి, శ్రావణి మధ్య రహస్య స్నేహం కొనసాగుతోంది. ఆ తర్వాత అశోక్ రెడ్డి కార్తికేయతోనే “ఆర్.ఎక్స్. 100” సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత శ్రావణితో రిలేషన్ మరింత పెరిగింది అశోక్ రెడ్డికి.

Also Read: Ashok Reddy is in absconding

అశోక్ రెడ్డితో “సంబంధం” ఉండగానే కాకినాడకు చెందిన దేవరాజ్‌రెడ్డి లాస్ట్ ఇయర్ పరిచయం అయ్యాడు. ఇద్దరూ క్లోజ్ గా తిరగడం మొదలు పెట్టారు. అలా దేవరాజ్ రెడ్డి, అశోక్ రెడ్డి, సాయి కృష్ణ రెడ్డిలతో శ్రావణి ట్రయాంగిల్ స్టోరీ అనేక మలుపులు తిరిగింది. ఐతే, ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకొంది, దానికి దారితీసిన పరిస్థితులు, వ్యక్తుల గురించి విచారణలో తేలాలి

మొత్తమ్మీద, ఈ కేసులో నిర్మాత అశోక్ రెడ్డి అడ్డంగా ఇరుక్కున్నాడు.

Related Stories