‘వీరయ్య’ పేరు వెనుకున్న స్టోరీ

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ అనే పేరు ఎందుకు పెట్టారు? ఈ టైటిల్ వెనుకున్న స్టోరీ ఆసక్తికరం.

మొదట ఈ సినిమాకి బాబీ అనుకున్న పేరు వాల్తేర్ శీను. కానీ, చిరంజీవి తన పాత్ర పేరుని శీను నుంచి వీరయ్యగా మార్చారు. ఎందుకంటే చిరంజీవి జీవితంలో ‘వీరయ్య’ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనికి నివాళిగా తన పాత్ర పేరును, సినిమా టైటిల్ ని ‘వీరయ్య’గా ఉంచారు.

చిరంజీవి తండ్రి ఒక కానిస్టేబుల్. అప్పట్లో చిరంజీవి పేరు శివశంకర వరప్రసాద్. చదువుకునే రోజుల్లోనే నటనపైన ఆసక్తి. “చిరంజీవి ఫేస్ కటింగ్, డ్యాన్సులు చూసి మీ వోడు సినిమాల్లోకి వెళ్తే రాణిస్తాడయ్యా,” అని చిరంజీవి త్రండికి ఆయన స్నేహితుడు వీరయ్య చెప్పారట. అలా చిరంజీవి యాక్టింగ్ కెరీర్ కి అక్కడ బీజం పడింది.

అప్పట్లో ‘వీరయ్య’ మాట వల్లే తాను సినిమాల్లోకి వచ్చేందుకు మార్గం సుగమం అయింది అని అంటారు చిరంజీవి. అందుకే, ఇప్పుడు ఆయనకి నివాళిగా పేరుని వీరయ్యగా పెట్టుకున్నారు.

 

More

Related Stories