ఈ నెల 24న “ది ట్రయల్”

“ది ట్రయల్” అనే ఇంగ్లీష్ టైటిల్ తో రూపొందిన తెలుగు చిత్రం తెలుగులోనే మొదటి ఇంటరాగేటివ్ థ్రిల్లర్. అంటే సినిమా మొత్తం ఇంటరాగేషన్ గా సాగుతుంది. పోలీసులు చేసే విచారణ పద్దతిలోనే ఉంటుంది. ఇలా సినిమా ఆసాంతం ఇంటరాగేషన్ లో ఉంటే దాన్ని ఇంటరాగేటివ్ థ్రిల్లర్ అంటారట.

తెలుగులో ఇప్పటివరకు ఎవరూ తీయని జోనర్లో తీసిన ఈ మూవీ ఈ నెల 24న విడుదల కానుంది.

స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రలు పోషించారు. రామ్ గన్ని రూపొందించారు. స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించారు. సుదర్శన్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

ఈ సినిమా ఇప్పటిదాకా తెలుగు తెరపై చూడని సరికొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇస్తుందని చిత్రబృందం నమ్మకంతో చెబుతున్నారు.

Advertisement
 

More

Related Stories