తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తే విన్నవాళ్ళ కర్ణభేరి పగిలేలా ఉంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అతని సంగీతం డెసిబెల్స్ శృతి మించిపోతోంది అని థియేటర్ల ఓనర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల “స్కంద” సినిమా విడుదల కాగానే గుంటూరులోని ఒక మల్టిప్లెక్స్ సంస్థ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది.
“తమన్ ని ఎవరైనా కంట్రోల్ చెయ్యండి. ఆయనని తట్టుకోవడం కష్టంగా మారింది. స్కంద సినిమా ప్రదర్శన సందర్భంగా సౌండ్ పొల్యూషన్ తట్టుకోలేక ప్రేక్షకులు సౌండ్ తగ్గించమని మమ్మల్ని కోరుతున్నారు. ఇది ప్రేక్షకులకు మాత్రమే ఇబ్బంది కాదు మా థియేటర్లకు కూడా ఇబ్బందే,” అంటూ పోస్ట్ లో పెట్టారు.
“అఖండ” సినిమాలో తమన్ ఇచ్చిన హై డెసిబల్ మ్యూజిక్ కి బాగానే పేరు వచ్చింది. కానీ అవసరం లేకున్నా, సందర్భం, సన్నివేశంతో సంబంధం లేకుండా చెవులు గిల్లుమనేలా సంగీతం కొడుతున్నాడు తమన్. దాంతో, తమన్ ని కంట్రోల్ చెయ్యాలి అంటున్నారు థియేటర్ల ఓనర్లు.
తమన్ ఇటీవల ఇస్తున్న పాటలు కూడా పెద్దగా హిట్ అవట్లేదు.