అప్పుడు పూరి, ఇప్పుడు సూరి

పూరి జగన్నాధ్ చెప్పింది గుడ్డిగా నమ్మేసి విజయ దేవరకొండ ‘లైగర్’ సినిమా అప్పుడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. సిక్స్ ప్యాక్ బాడీ పెంచుకున్నాడు. పోస్టర్లలో ఆల్మోస్ట్ నగ్నంగా కనిపించాడు. సినిమా గురించి చాలా ఓవర్ గా బిల్డప్ ఇచ్చాడు. విడుదలైన మొదటి రోజే అన్ని చోట్లా డిజాస్టర్. ఆ ఫలితం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు విజయ్ దేవరకొండ.

ఇప్పుడు అఖిల్ అక్కినేనిది దాదాపుగా అదే పరిస్థితి. ‘లైగర్’కి వచ్చినంత హైప్ ‘ఏజెంట్’కి లేదు కానీ దర్శకుడు సూరి (సురేందర్ రెడ్డి) చెప్పింది బలంగా నమ్మి ఈ సినిమా కోసం రెండేళ్ల పాటు కష్టపడ్డాడు. మొత్తం బాడీని మార్చేసుకున్నాడు. ‘ఏజెంట్’తో తనకి మొదటి బ్లాక్ బస్టర్ వస్తుందని గట్టిగా నమ్మాడు. కానీ, తలాతోకా లేకుండా సూరి తీసిన ఈ సినిమాకి అన్ని రివ్యూస్ బ్యాడ్ గా వచ్చాయి. మౌత్ టాక్ కూడా దారుణంగా ఉంది.

అందుకే, జనం అప్పుడు పూరి ఇప్పుడు సూరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

లైగర్, ఏజెంట్ విషయంలో మరో కామన్ ఎలిమెంట్ ఉంది. ‘లైగర్’ సాలా క్రాస్ బ్రీడ్ అంటూ హడావుడి చేశారు. ‘ఏజెంట్’లో వైల్డ్ సాలా అంటూ హంగామా. రెండింటిలోనూ ‘సాలా’. ఇక చాలు సాలా అని జనం తీర్పు ఇచ్చినట్లే.

 

More

Related Stories