అప్పుడు రామ రామ… ఇప్పుడు లాహే లాహే!

Laahe Laahe

చాలా మంది దర్శకులు తీసిందే తీస్తుంటారు అని సినిమా పండితులు చెప్తారు. స్టీవెన్ స్పీల్బర్గ్ అయినా, మణిరత్నం అయినా… వారి ప్రతి సినిమాలో కొన్ని కామన్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. ఇది సినిమాని ఒక రీసెర్చ్ గా చదివిన మేధావులు తేల్చిన విషయం. ఆ సంగతేమో కానీ మన తెలుగు డైరెక్టర్లు మాత్రం ‘సెంటిమెంట్’ని ఎక్కువ ఫాలో అవుతుంటారు. తమకి సక్సెస్ ఇచ్చిన సినిమాలోని కొన్ని సెంటిమెంట్ ఎలిమెంట్స్ ని ఎక్కువగా తమ సినిమాల్లో రిపీట్ చేస్తుంటారు.

కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతోన్న ‘ఆచార్య’ సినిమా నుంచి వచ్చిన తొలి పాట వింటే మొదట అనిపించింది ఇదే. ‘శ్రీమంతుడు’ సినిమాలో ‘రామ రామ’ పద్దతిలో ఈ సరి శివుడి మీద ‘లాహే లాహే’ అనే సాంగ్ ఇరికించినట్లు కనిపిస్తోంది. ఈ పాట కూడా ఇన్ స్టాంట్ గానే క్లిక్ అయింది. సాంగ్ అప్పుడే ట్రెండింగ్ లోకి వచ్చింది.

మరి ఈ పాటలాగే, ‘ఆచార్య’ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందా? లెట్స్ సి. ‘ఆచార్య’ మే 13న విడుదల కానుంది.

Advertisement
 

More

Related Stories