కృతి శెట్టికి మూడో పరీక్ష!

తెలుగుసినిమా తెరపై ‘ఉప్పెన’లా విరుచుకుపడిన అందం… కృతి శెట్టి. ఆ ఒక్క సినిమాతో ఒకటా, రెండా అరడజను చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ఉప్పెన తర్వాత విడుదలైన ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ ఆమెకి ఆనందాన్నే మిగిల్చాయి. ఇంకా చెప్పాలంటే లక్కీ హీరోయిన్ అనే ముద్ర కూడా పడింది.

ఐతే, ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. రీసెంట్ గా రెండు సినిమాలు వ్యతిరేక ఫలితాలు చూపాయి. దాంతో, కృతికి టెన్షన్ మొదలైంది. జులైలో విడుదలైన ‘ది వారియర్’, ఆగస్టులో వచ్చిన ‘మాచర్ల నియోజకవర్గం’ పరాజయం పాలు అయ్యాయి. ఇప్పుడు సెప్టెంబర్లో “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమా విడుదల అవుతోంది. ఈ నెల 16న థియేటర్లలోకి రానుంది ఈ మూవీ. దీని ఫలితం గురించి కృతికి దడ మొదలైంది.

దర్శకుడు ఇంద్రగంటి రొమాంటిక్ చిత్రాలు బాగా తీస్తారు. ఐతే, ఆయన సినిమాలు గ్యారెంటీగా హిట్ అవుతాయి అని చెప్పలేం. సో, అందుకే ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అని ఆమెకి కొంచెం టెన్షన్ ఉన్నట్లు అర్థం అవుతోంది. ప్రస్తుతం ఐతే ఈ సినిమా ప్రమోషన్ తో బిజీగా ఉంది.

సెట్స్ పై రెండు చిత్రాలు

తమిళంలో సూర్యతో మరో సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే, నాగ చైతన్య సరసన మరో సినిమా ఈ నెలలోనే మొదలు కానుంది. ఐతే, కొత్తగా సినిమాలు రావాలన్నా, పారితోషికం పెరగాలన్నా ఫ్లాపులకు బ్రేక్ పడాలి.

అందుకే, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఫలితం గురించి ఎక్కువ ఆలోచిస్తోంది.

 

More

Related Stories