చిన్న సినిమాలకు ఇదే బెస్ట్ టైం!

Priya Varrier

పెద్ద సినిమాలన్నీ పోస్ట్ ఫోన్ అయ్యాయి. కరోనా కల్లోలంతో పెద్ద సినిమాలను కూడా చూసేందుకు జనం ఆసక్తి చూపడం లేదు. మంచి టాక్, మంచి రివ్యూలు సంపాదించుకున్న ‘వకీల్ సాబ్’కి కూడా నాలుగు రోజుల తరవాత కలెక్షన్లు నీరసించాయి.

గత వారం రోజులుగానే సెకండ్ వేవ్ కేసులు బాగా పెరిగాయి. టీవీ ఛానెల్స్ ఆన్ చేస్తే కరోనా వార్తలే. దాంతో జనం సినిమా థియేటర్లకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ‘వకీల్ సాబ్’ బాగానే వసూళ్లు అందుకొంది. ఐతే, గత రెండు రోజులుగా మాత్రం… వకీల్ సాబ్ పూర్తిగా పడిపోయింది. ఇలాంటి టైంలో ఏ పెద్ద సినిమా కూడా రిలీజ్ కి ధైర్యం చెయ్యదు.

ఆచార్య, లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాట పర్వం… ఇలా ప్రముఖ సినిమాలన్నీ వాయిదా బాట పట్టాయి.  ఇక ప్రభుత్వాలు కూడా థియేటర్ల అక్యుపెన్సీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోనున్నాయి. వచ్చే వారం ఇది అమలయ్యే అవకాశం ఉంది. దాంతో… ఈ టైంలోనే తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడం బెటరని చిన్న చిత్రాల నిర్మాతలు భావిస్తున్నారు. ఎందుకంటే, ఇప్పుడు మాత్రమే వారికి థియేటర్లు ఈజీగా దొరుకుతాయి.

Also Check: Priya Varrier in Hyderabad

ఈ నెల 23న ‘ఇష్క్ నాట్ లవ్ స్టోరీ’, ‘శుక్ర’, ‘కథానిక’, ‘తెలంగాణ దేవుడు’, ‘రేడియో మాధవ్’,  30న  ‘చేరువైనా దూరమైనా’, ‘థాంక్యూ బ్రదర్’, ‘ఏక్ మినీ కథ’ వంటి చిన్న చిత్రాలు థియేటర్ లలోకి వస్తున్నాయి. ఇలాంటి సినిమాలకు ఇదే బెస్ట్ టైం. ఎంత వస్తే అంత అనుకోవడమే.

More

Related Stories