
ఒక్కో హీరోయిన్ కి ఒక్కో టైమ్ వస్తుంది. ఇప్పుడు త్రిషకి వచ్చింది. త్రిష హీరోయిన్ గా 15 ఏళ్ల క్రితం టాప్ లో ఉంది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అలాంటి క్రేజ్ చూస్తోంది. ముఖ్యంగా తమిళ సినిమా ఇండస్ట్రీలో ఈ భామకి ఇప్పుడు అన్ని పెద్ద చిత్రాలే దక్కుతున్నాయి.
ఇప్పటికే “లియో” సినిమాతో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకొంది. “లియో”కన్నా ముందు మణిరత్నం తీసిన “పొన్నియన్ సెల్వన్” రెండు భాగాలు రికార్డు హిట్స్ గా ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు “థగ్ లైఫ్” కూడా ఆమె అకౌంట్లోనే చేరింది.
“థగ్ లైఫ్” అనేది మణిరత్నం కొత్త చిత్రం. కమల్ హాసన్ హీరోగా మణిరత్నం తీస్తున్న మూవీ. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, జయం రవి కూడా నటిస్తున్నారు. హీరోయిన్ పాత్ర మాత్రం త్రిషదే.
కమల్ హాసన్ తో ఇప్పటికే త్రిష హీరోయిన్ గా నటించింది. మళ్ళీ ఆ ఛాన్స్ దక్కింది. ఒక విధంగా చెప్పాలంటే నయనతార కన్నా త్రిష అకౌంట్లోనే ఇప్పుడు పెద్ద హిట్స్ ఉన్నాయి.
తమిళ సినిమా రంగానికి సంబంధించి ఇప్పుడు ఆల్ టైం హిట్స్ ఏవంటే… “పొన్నియన్ సెల్వన్”, “జైలర్”, “విక్రమ్”, “లియో” చిత్రాలు అని చెప్పాలి. ఇందులో “విక్రమ్” సినిమాలో హీరోయిన్ ఎవరూ లేరు. సో, మిగతా మూడు భారీ హిట్లలో రెండింటిలో త్రిషనే హీరోయిన్. ఇప్పుడు, ఈ “థగ్ లైఫ్”తో మార్ ఆల్ టైం హిట్ ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.