అవి ఇక బాధించవు: సమంత


జీవితంలో ఫిలసాఫికల్ గా మారింది సమంత. ఒకప్పుడు తనని బాగా వేధించిన విషయాలు ఇప్పుడు దూదిపింజల్లా తేలిపోయాయి అని చెప్తోంది సమంత. అవి మనసుకు నొప్పి కలిగించడం లేదట.

సమంత నటించిన మొదటి చిత్రం… ఏ మాయ చేసావె. ఈ సినిమా విడుదలై 13 ఏళ్ళు పూర్తి అయింది. ఈ పదమూడేళ్లల్లో ఆమె హీరోయిన్ గా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకొంది. తన మొదటి హీరోనే ప్రేమించి పెళ్లాడింది. కానీ ఆ వివాహ బంధం మూణ్ణాళ్ళ ముచ్చటైంది. అలాగే ఒక మొండి వ్యాధితో పోరాటం చేసి విజయం సాధించింది. విజయాలతో పాటు ఆమె జీవితంలో ఎన్నో మలుపులు, కుదుపులు. ఐతే, ఇప్పుడు రాటుదేలింది.

“వయసు పెరుగుతున్న కొద్దీ మరింతగా జీవితంలో ఎదుగుతా. ఉదయించే ప్రతి రోజూ తీసుకొచ్చే నిత్య నూతన ఆనందాలకు కృతజ్నతగా ఉంటా. ఈ ప్రేమ, ఆప్యాయతలకు రుణపడి ఉంటాను. ఒకప్పుడు మనసుకు కలుక్కుమనిపించిన ఎన్నో విషయాలు ఇప్పుడు బాధించడం లేదు. ఇక బాధించవు,” అని రాసుకొంది.

ప్రస్తుతం సమంత ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అలాగే, విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ అనే సినిమా కూడా చేస్తోంది.

 

More

Related Stories