తెలంగాణాలో ఇక 150, 200

Sankranthi 2022


తెలంగాణ ప్రభుత్వం థియేటర్లలో టికెట్ రేట్లను 300 రూపాయల వరకు పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. ఐతే, ఇంతే అమౌంట్ కి అమ్మాలని ఫిక్స్ చెయ్యలేదు. మల్టిప్లెక్స్ లలో 300 రూపాయలు మించొద్దు రిక్లైనర్ సీట్లకు 350 రూపాయలు దాటొద్దు) అని కండీషన్. ఇది మాక్జిమం రేట్. 300లోపు ఎంత రేటు పెట్టుకుంటారు అనేది నిర్మాతల ఇష్టం. సినిమా స్థాయిని బట్టి వాళ్లే నిర్ణయించుకోవాలి.

ఐతే, ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కదా అని మనవాళ్ళు చిన్న సినిమాలకు కూడా 295 రేట్లు పెట్టి అమ్మి చేతులు కాల్చుకున్నారు. అంత రేట్ పెట్టి చూసేందుకు ఎవరూ రాలేదు. దాంతో, ఇప్పుడు జ్ఞానోదయం అయింది. సంక్రాంతి పండక్కి రేట్లను తగ్గించారు నిర్మాతలు.

ఈ వీకెండ్ కి వస్తున్న ‘బంగార్రాజు’ చిత్రానికి మల్టిప్లెక్స్ లలో 200 రూపాయలు, మామూలు థియేటర్లలో 150 రూపాయల రేటుకు అమ్ముతున్నారు. చిన్న సినిమాలైన ‘రౌడీ బాయ్స్’, ‘హీరో’ చిత్రాలకు మల్టిప్లెక్స్ లలో కూడా 150 రూపాయలకి ఫిక్స్ చేశారు.

‘ఆర్ ఆర్ ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’, ‘భీమ్లా నాయక్’ వంటి పెద్ద చిత్రాలకు మాత్రమే మొదటివారం 295 రూపాయలకు అమ్మాలి అని చిన్న, మధ్య తరహా సినిమాలను 150, 200కి ఫిక్స్ చెయ్యాలని నిర్ణయించారు.

Advertisement
 

More

Related Stories