ఇకపై ఏ సినిమాకైనా ఇంతే!?

CM YS Jagan Mohan Reddy

‘వకీల్ సాబ్’ సినిమాని టార్గెట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు వ్యతిరేకంగా జీవోని విడుదల చేసింది అని విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన సొంత పత్రిక ‘సాక్షి’లో ఇలా రాశారు.

“ఎవరి సినిమా అయినా.. ఏ రోజైనా.. టికెట్‌ ధర మాత్రం ఒకటే ఉండాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. తొలి రోజైనా, తొలి మూడు రోజులైనా.. నాలుగో రోజైనా వేసేది అదే సినిమా. అందులో తొలి మూడు రోజులు అదనపు పాటలు, సీన్ల వంటివేమీ ఉండవు. మరి అలాంటప్పుడు తొలి మూడు రోజులూ టికెట్ల ధరలు పెంచటం ఎందుకు అన్న సగటు ప్రేక్షకుడి ప్రశ్న సబబే అని ప్రభుత్వం ఏకీభవించింది. ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీశామని, నటీ నటులకు ఎక్కువ పారితోషికం ఇచ్చామని.. తదితర కారణాలతో టికెట్ల రేట్లు పెంచుతామంటే ఇకపై కుదరదని స్పష్టం చేసింది.”

ఇకపై ఏ సినిమా అయినా (అంటే రాబోయే పెద్ద సినిమాలు “ఆర్ ఆర్ ఆర్”, “రాధేశ్యామ్”, “పుష్ప” వంటివి కూడా టికెట్ ధరలు పెంచేందుకు వీలు లేదు) సాధారణ రేట్స్ కే సినిమాని ప్రదర్శించాలి. ఐతే, మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటున్నారు చాలా కాలంగా. అలాగే, ఎన్టీఆర్ మిత్రుడు కొడాలి నాని మంత్రి.

మరి, ఆర్ ఆర్ ఆర్, ఆచార్య సినిమాల విడుదల టైంలో ఏపీ గవర్నమెంట్ ఇంతే నిక్కచ్చిగా ఉంటుందా అనేది డౌటే. అప్పటికి మళ్ళీ ‘సవరించిన జీవో’ వస్తుందా అనేది చూడాలి.

Advertisement
 

More

Related Stories