
ఈ ఏడాది ‘రావణాసుర’గా మనముందుకొచ్చారు రవితేజ. మాస్ మహారాజా నటించిన ఆ సినిమా దారుణ పరాజయం పాలైంది. ఐతే ఇప్పుడు మరో మూవీతో లెక్కలు సరి చేసేపనిలో ఉన్నారు రవితేజ.
రవితేజ కొత్త చిత్రం… ‘టైగర్ నాగేశ్వరరావు’. నిర్మాత అభిషేక్ అగర్వాల్ తీస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది.
‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్ మే 24న విడుదల కానుంది. రాజమండ్రిలో ఒక భారీ ఈవెంట్ లో ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని టాక్.
“1970”లలో గడగడలాడించిన స్టూవర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా ఇది రూపొందుతోంది. ఈ పాత్ర పోషించేందుకు సరికొత్త బాడీ లాంగ్వేజ్, యాసని నేర్చుకున్నారు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రం అక్టోబర్ 20న విడుదల అవుతుంది.