నయనతారకి క్లిన్ చిట్!

Nayanthara


అనుకున్నదే జరిగింది. నయనతార సరోగసీ వివాదం ముగిసింది. తమిళనాడు ప్రభుత్వానికి నిపుణల కమిటీ నివేదిక అందచేసింది. నయనతార, ఆమె భర్త ఎలాంటి నిబంధనలు ఉల్లగించలేదని ఇద్దరు డాక్టర్లతో కూడిన కమిటీ తమిళనాడు ఆరోగ్య మంత్రిత్వ శాఖకి నివేదించింది.

ఈ ఏడాది జూన్ 9న నయనతార, విగ్నేష్ సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్ 9న కవలలు పుట్టినట్లు ప్రకటించింది జంట. పెళ్ళైన జంట ఐదేళ్ల తర్వాతే సరోగసీకి అప్లై చేసుకోవాలనేది చట్టం చెప్తోంది. నయనతార సరోగసీ నిబంధనలు ఉల్లంఘించినట్లు అర్థమవుతోందని పలువురు సందేహాలు లేవనెత్తారు. వివాదం రేగడంతో తమిళనాడు ప్రభుత్వం కమిటీ వేసింది.

ఈ నివేదికలోని ముఖ్యాంశాలు…

  • నయనతార, విగ్నేష్ మార్చి 11, 2016న రిజిస్టర్డ్ పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయ పద్దతిలో వారు ఈ ఏడాది జూన్ లో పెళ్లి చేసుకున్నా… చట్టం ప్రకారం వాళ్ళు 2016 నుంచి దంపతులు.
  • 2020 ఆగస్టులో పిండం ఏర్పడింది. ఒక ఆసుపత్రిలో ప్రిజర్వ్ చేశారు.
  • నవంబర్ 2021లో సరోగేట్ తల్లితో లీగల్ డాక్యమెంట్లపై సంతకం పెట్టించారు. ఈ ఏడాది మార్చిలో సరోగేట్ తల్లి గర్భంలో పిండం పంపారు. ఈ నెల అక్టోబర్ లో ఆమె కవలలకు జన్మనిచ్చారు.
  • భారతీయ విద్యా మండలి నిబంధనలు అన్ని పాటించారు.
Advertisement
 

More

Related Stories