ఈ రోజంతా సందడే సందడి

Pooja Jhaveri

ఓటీటీలో ఈరోజు చాలా సందడి నడుస్తోంది. దాదాపు అన్ని పాపులర్ యాప్స్ ఈరోజు కొత్త కంటెంట్ ను అప్ లోడ్ చేశాయి. అవేంటో చూద్దాం.

zee5లో ఈరోజు “47 డేస్” అనే తెలుగు సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. సత్యదేవ్, పూజా ఝవేరీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. అటు డిస్నీ హాట్ స్టార్ లో “ఫోర్డ్ వెర్సెస్ ఫెరారీ” సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. దీంతో పాటు ఓ టీవీ షోను కూడా అందుబాటులోకి తెచ్చింది డిస్నీ.

ఇక నెట్ ఫ్లిక్స్ ఈరోజు చాలా కంటెంట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. “స్లీప్ లెస్”, “ది 40 ఇయర్ ఓల్డ్ విర్జిన్”, “బాల్టో”, “హౌ హై”, “సెరినిటీ” లాంటి ఫీచర్ ఫిలిమ్స్ తో పాటు “బ్లాక్ క్లోవర్” అనే కొత్త సిరీస్ ను స్టార్ట్ చేసింది. వీటితో పాటు “బీఎన్ఏ”, “విల్ డూ ఇట్ ఫర్ హాఫ్” లాంటి ఒరిజినల్ కంటెంట్ ను కూడా స్ట్రీమింగ్ కు పెట్టింది.

Related Stories