బాలీవుడ్ బాటలో టాలీవుడ్

SRK and SVP

కరోనా రెండో వేవ్ నుంచి మహారాష్ట్ర కోలుకుంటోంది. ముంబైలో సాధారణ జీవనం, పనులు మొదలయ్యాయి. బాలీవుడ్ పెద్ద సినిమాలు కూడా షూటింగ్స్ కి రెడీ.

వచ్చే సోమవారం నుంచి ముంబైలో పెద్ద ఎత్తున షూటింగులు షురూ కానున్నాయి.  షారుక్ ఖాన్ నటిస్తున్న బిగ్ మూవీ ‘పఠాన్’ ఈ నెల 21 నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకోనుంది. రణబీర్ కపూర్ రెండు సినిమాల షూటింగులు వచ్చే వారం సెట్ కి వెళ్తున్నాయి. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగణ్ తమ సినిమాల షూటింగ్స్ ని జులైలో ప్రారంభిస్తారట.

ఇక మీడియం రేంజు, చిన్న చిత్రాల షూటింగులు ఆల్రెడీ జరుగుతున్నాయి.

బాలీవుడ్ ని చూసి మన టాలీవుడ్ ఫిలింమేకర్స్ కూడా సిద్ధమవుతున్నారు మళ్ళీ షూటింగులకు. ‘సర్కారు వారి పాట, ‘ఆచార్య’, ‘రాధేశ్యామ్’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి చిత్రాలు కూడా జులైలో మొదలవుతాయట. చిన్న చిత్రాలు మరో వారం తర్వాత సెట్స్ పైకి వస్తాయి.

More

Related Stories