పార్టీ కల్చర్ ప్రవేశపెట్టింది నేనే

ఓ సినిమా హిట్టయితే పార్టీ చేసుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అదేదో యూనిట్ మాత్రమే చేసుకోవడం కాదు, టోటల్ ఇండస్ట్రీ పార్టీ చేసుకుంటోంది. ఆమధ్య మహానటి హిట్టయినప్పుడు అల్లు అర్జున్ చాలామందికి పెద్ద పార్టీ ఇచ్చాడు. ఆ తర్వాత అలాంటివి మరికొన్ని జరిగాయి. అయితే టాలీవుడ్ లో ఈ పార్టీ కల్చర్ కు ఆద్యుడు ఎవరు? అది నేనే అంటున్నారు చిరంజీవి.

“నేను కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు లాంటి హీరోలంతా కలిసే ఉండేవారు. కానీ ఆ హీరోల అభిమానులు మాత్రం కొట్టుకునే వారు. ఒకరి పోస్టర్లపై ఒకరు పేడ కొట్టేవారు. ఈ పద్ధతిని నేను మార్చాలనుకున్నాను. అందుకే ఓ సినిమా హిట్టయినా, ప్రారంభోత్సవం జరిగినా అందర్నీ నేను పిలిచేవాడ్ని. అందరికీ పార్టీ ఇచ్చేవాడ్ని. అలా టాలీవుడ్ లో పార్టీ కల్చర్ ను నేనే ప్రవేశపెట్టాను. 2-3 పెగ్గుల తర్వాత అందరికీ ప్రేమ పొంగి పొర్లేది. ఆ పార్టీ తర్వాత అందరం బాగుండేవాళ్లం. ఆ ఫలితాల్ని నేను చూశాను.”

ఇలా టాలీవుడ్ లో అందర్నీ కలుపుకొని వెళ్లేవాడినని చెప్పారు చిరు.

బీజీపీ నేత బండారు దత్తాత్రేయ ఏర్పాటుచేసిన అలయ్-బలయ్ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి, ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

ఇదే వేదికపై తన అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవి. గాడ్ ఫాదర్ సినిమాను సూపర్ హిట్ చేసి ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గాడ్ ఫాదర్ సక్సెస్ తో అలయ్-బలయ్ లో ఉత్సాహంగా కనిపించారు చిరంజీవి. అదే విషయాన్ని సభా వేదికపై ప్రకటించారు కూడా. 

Advertisement
 

More

Related Stories