వాళ్ళు హైదరాబాద్ కి, మనవాళ్ళు గోవాకి

Movie Shootings

తమిళ్ హీరో, హీరోయిన్లంతా హైదరాబాద్ కి క్యూ కడుతుంటే.. మనోళ్ల మాట మాత్రం ఛలో గోవా. కరోనా కేసుల కారణంగా అవుట్ డోర్ షూటింగ్ లు అంటే ఫిలిం మేకర్స్ అందరికి ఒకరకమైన భయం పట్టుకొంది. అందుకే, సేఫ్ గా రామోజీ ఫిలిం సిటీలో, హైదరాబాద్ చుట్టూపక్కల షూటింగ్స్ పెట్టుకుందామని అంటున్నారు తమిళ, కన్నడ, బాలీవుడ్ ఇండస్ట్రీ ఫిల్మీ జనం.

రజినీకాంత్ – కీర్తి సురేష – నయనతార నటిస్తున్న “అన్నత్తే” షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో సాగుతోంది. “కేజీఎఫ్ 2” క్లైమాక్స్ షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ, పరిసర ప్రాంతాల్లో తీశారు. అలాగే, నయనతార-సమంత-విజయ్ సేతుపతి నటిస్తున్న డైరెక్టర్ విగ్నేష్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోనే మొదలైంది. ప్రస్తుతం ఇక్కడే జరుగుతోంది.

అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న “మే డే” సినిమా మొత్తం హైద్రాబాద్లోనే మొదలుపెట్టి, పూర్తి చెయ్యాలని ఇక్కడికి వచ్చాడు. నాన్ స్టాప్ సింగిల్ షెడ్యూల్లో హైద్రాబాద్లో సినిమా పూర్తి అవుతుంది. నెక్స్ట్ మంత్ సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్, తమిళ్ సూపర్ స్టార్ విజయ్ కొత్త మూవీ షూటింగ్
ఇక్కడే షురూ కానున్నాయి.

ఐతే, తెలుగు ఫిలిం మేకర్స్ మాత్రం… గోవా వెళ్తున్నారు. ప్రస్తుతం నాని నటిస్తున్న మూవీ, అలాగే శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న “మహా సముద్రం” షూటింగ్స్ గోవాలోనే జరుగుతున్నాయి.

గోవాలో కరోనా కేసులు బాగా తక్కువ. అందుకే బీచ్ నేపథ్యంలో తీసే సినిమాల షూటింగ్స్ అన్ని గోవాకు షిఫ్ట్ అయ్యాయి. రెగ్యులర్ లొకేషన్, స్టూడియో ఎన్విరాన్మెంట్ కి హైదరాబాద్ బేస్ అయింది.

More

Related Stories