కొత్త కేసులతో టాలీవుడ్ భయం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గతంతో పోల్చితే ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. కానీ ముందు జాగ్రత్త చర్యగా తెలంగాణ ప్రభుత్వం తాత్కాలికంగా విద్యాసంస్థలను మూసివెయ్యాలని నిర్ణయించింది. రేపట్నుంచి స్కూల్స్, కాలేజ్ లు బంద్. కేవలం ఆన్ లైన్ క్లాస్ లు మాత్రమే ఉంటాయి.

ఐతే, థియేటర్ లలో ఆక్యుపెన్సీ విషయంలో కూడా ఇలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటుందా అనేది టాలీవుడ్ నిర్మాతల, హీరోలకు భయం పట్టుకొంది. దేశంలో ఒక్క తెలుగుసినిమా రంగమే కోలుకొని, గాడిలో పడింది. ఈ ఏడాది ‘క్రాక్’తో మొదలైన కలెక్షన్ల హోరు ‘జాతిరత్నాలు’ వరకు సాగింది. ఈ వీకెండ్ నితిన్ నటించిన ‘రంగ్ దే’, రానా నటించిన ‘అరణ్య’ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వచ్చేనెల పవన్ కళ్యాణ్ బిగ్ మూవీ ‘వకీల్ సాబ్’ ఉంది.

ఈ టైంలో ఆక్యుపెన్సీ రేషియోని 50 శాతానికి కనుక తగ్గిస్తే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అందుకే, నిర్మాతలు, హీరోలు వర్రీ అవుతున్నారు. ఐతే, ఇప్పటికిప్పుడు, అలాంటి నిర్ణయం ప్రభుత్వాలు తీసుకోకపోవచ్చు. ఎందుకంటే, ఆ రేంజులో కేసులు పెరగలేదు.

More

Related Stories