
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డితో మరోసారి భేటీ కానున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సారి చిరంజీవి మిగతా పెద్ద హీరోలను కూడా తీసుకెళ్లనున్నారు. ఈ నెల 10న అమరావతిలో వీరు ముఖ్యమంత్రిని కలుస్తారని టాక్.
మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ కూడా చిరంజీవితో కలిసి వెళ్లేందుకు అంగీకరించారని సమాచారం. రాజమౌళి, త్రివిక్రమ్, ఇతర పెద్ద దర్శకులు కూడా ఈ టీంలో ఉండొచ్చు.
ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలపై ఇంతవరకు వై.ఎస్.జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఈ మీటింగ్ తర్వాత టికెట్ ధరలను పెంచే అవకాశం ఉంది. పెద్ద సినిమాలు గట్టెక్కాలంటే జగన్ ని ఒప్పించాలి. అందుకే, పెద్ద హీరోలందరూ ఈ మీటింగ్ కి వెళ్లేందుకు సుముఖత చూపారట. మెగాస్టార్ చిరంజీవికి ఈ బాధ్యతని జగన్ అప్పగించారు. సో… ఈ నెల 10న ఈ మీటింగ్ జరగనుంది.
ఈ మీటింగ్ తర్వాతే అన్ని పెద్ద సినిమాల విడుదల తేదీలు పక్కాగా ఖరారు అని చెప్పుకోవచ్చు.