భర్తకి పాదపూజ తప్పు కాదు: ప్రణీత

Pranitha Subash

ఈనాటికి పాతకాలం సంప్రదాయాలకు విలువ ఇస్తారు కొందరు మహిళలు. ముఖ్యంగా కన్నడనాట బాగా చదువుకున్న, మంచి జాబ్ చేస్తున్న మహిళలు కూడా ఆచారాలను తూచా తప్పకుండా పాటిస్తారు. హీరోయిన్ ప్రణీత సుభాష్ కూడా అలాంటి కన్నడ కస్తూరి. ఐతే, హీరోయిన్ ప్రణీత ఇటీవల ఒక ఫోటో షేర్ చేసింది. అది పెద్ద చర్చకు దారితీసింది. ప్రణీత తన భర్త పాదాలకు పూజ చేస్తున్న ఫోటో అది.

“భీమన అమావాస్య” సందర్భంగా ఆమె తన భర్తని ఒక కుర్చీలో కూర్చుండబెట్టి తాను ఆయన పాదాలకు పూజ చేసింది, నమస్కరించింది.

“భర్త పాదాలకు పూజ చేసే పురాతన సంస్కృతి నుంచి మనం బయటపడ్డాం. అయినా ప్రణీతలాంటి హీరోయిన్లు పితృస్వామ్య ఆచారాలను కొత్తగా ప్రచారం చేసే పనిని భుజాల మీద వేసుకున్నారు. దీని వెనుక రాజకీయం ఉందని,” మీడియాలో, సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. దాంతో, ఆమె ఇప్పుడు వివరణ ఇచ్చింది.

“మన తల్లితండ్రుల కాళ్లు మొక్కుతున్నాం. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. అలాగే భర్త కాళ్ళు మొక్కితే తప్పేంటి? నేను భారతదేశంలో పుట్టిన మహిళని. హిందువు అమ్మాయిని. ఈ దేశంలో అత్యధిక జనాభా పాటించే మతాచారాలు, సంప్రదాయాలు పాటిస్తే పితృస్వామ్యం అని కామెంట్ చెయ్యడం మూర్కత్వం,” అని ఆమె జవాబు ఇచ్చింది.

తెలుగులో ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ప్రణీత బెంగుళూరుకి చెందిన నితిన్ రాజ్ అనే సాఫ్ట్వేర్ వ్యాపారవేత్తని పెళ్లాడింది. 2021 మేలో వీరి పెళ్లి జరిగింది. వీరికి ఇప్పుడు ఒక పాప.

Advertisement
 

More

Related Stories