- Advertisement -

ధనుష్ హీరోగా రూపొందిన సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ‘కర్ణన్’ రిలీజ్ అయింది. ఇప్పుడు డైరెక్ట్ గా ఓటిటి వేదికపై విడుదల కానుంది ‘జగమే తంత్రం’ అనే మూవీ. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా హక్కులు పొందింది. లేటెస్ట్ గా ట్రైలర్ విడుదలైంది.
రజినీకాంత్ తో ‘పేట్టా’ వంటి సినిమా తీసిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ మూవీకి డైరెక్టర్. ఇందులో గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తాడు ధనుష్.
తమిళనాడు నుంచి లండన్ కి వెళ్లి అక్కడ మాఫియా నాయకుడిగా ఎదిగిన వాడి కథ ఇది. ధనుష్ ఇటీవల ఎక్కువగా దళిత యువకుడి పాత్రలు పోషించాడు. ఇప్పుడు మాఫియా నాయకుడిగా పూర్తిగా కొత్త నటన చూపుతున్నాడు.
సినిమా, సినిమాకి నటనలో ధనుష్ చూపుతున్న వైవిధ్యం అద్భుతమని చెప్పాలి. ఈ నెల 18న నెట్ ఫ్లిక్స్ డైరెక్ట్ గా విడుదల కానుంది ఈ మూవీ.