రవితేజ సినిమాలో ట్రిపుల్ గ్లామర్

రవితేజ ‘క్రాక్’ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. దాంతో ఆయన నెక్స్ట్ సినిమాలో ఫుల్లుగా గ్లామర్ ని నింపుతున్నారు. ‘ఖిలాడి’ పేరుతో దర్శకుడు రమేష్ వర్మ తీస్తున్న ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ పోషిస్తున్నాడు. సో… ఇద్దరు హీరోయిన్లని తీసుకున్నారు. మీనాక్షి చౌదరి అనే కొత్త భామతో పాటు ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ఒక పాటలో డాన్స్ చేసిన డింపుల్ హయతి మరో హీరోయిన్ గా నటిస్తోంది.

లేటెస్ట్ గా అనసూయ జాయిన్ అయింది. అనసూయ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. అంటే.. ఈ సినిమాలో ముగ్గురు గ్లామర్ భామలున్నట్లే. సినిమా నిండా గ్లామరే. అలాగే ఒక ఐటెం సాంగ్ కూడా ఉంటుందిట. ఆ పాటకి ఎవరిని తీసుకుంటారో చూడాలి.

‘క్రాక్’ సినిమాతో వచ్చిన సక్సెస్ ని మైంటైన్ చేసేందుకు రవితేజ పడుతున్న తిప్పలివి.

More

Related Stories