ట్రిపుల్ రోల్ తో కష్టాలే

Nandamuri Kalyan Ram


హీరో నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రిభినయం చేసిన ‘అమిగోస్’ గత వారం విడుదలైంది. సినిమా దారుణంగా పరాజయం పొందింది. ఈ సినిమా ఆడకపోవడానికి ప్రధాన కారణం … తీసిన విధానం ఆసక్తికరంగా లేకపోవడమే.

ఐతే, ఇప్పటివరకు త్రిపాత్రిభినయం హీరోలకు పెద్దగా కలిసి రాలేదు అన్న మాట కూడా వినిపిస్తోంది. మహానటుడు నందమూరి తారకరామారావు ‘దాన వీర శూర కర్ణ’లో మూడు పాత్రలు పోషించి అదరగొట్టారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఐతే, ఈ సినిమా కన్నా ముందే మరో సినిమాలో త్రిపాత్రిభినయం చేశారు ఎన్టీ రామారావు. కానీ అది ఆడలేదు.

ఇక సూపర్ స్టార్ కృష్ణ అనేక చిత్రాల్లో త్రిపాత్రిభినయం చేయగా కేవలం ‘కుమార్ రాజా’ అనే మూవీ మాత్రమే ఆడింది. మెగాస్టార్ చిరంజీవి ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రంలో మూడు పాత్రలు పోషించారు. కానీ దాన్ని ప్రేక్షకులు హిట్ చెయ్యలేదు. నందమూరి బాలకృష్ణ ‘అధినాయకుడు’ వంటి చిత్రంలో తాతగా, తండ్రిగా, కొడుకుగా మూడు పాత్రల్లో కనిపిస్తే జనం తిప్పికొట్టారు.

జూనియర్ ఎన్టీఆర్ ‘జై లవకుశ’ చిత్రంలో మూడు పాత్రలు పోషిస్తే యావరేజ్ అనిపించుకొంది. ఓవరాల్ గా ట్రిపుల్ రోల్స్ తో హీరోలకు విజయాల శాతం తక్కువే.

 

More

Related Stories