రెండింతలు చేసిన తృప్తి!

Tripti Dimri

తృప్తి డిమ్రి గురించి ఇంట్రడిక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమాతో పాపులర్ అయింది ఈ బ్యూటీ. ఇప్పుడు తెగ అవకాశాలు వస్తున్నాయి. మరి ఆఫర్లు వచ్చినప్పుడే, క్రేజ్ ఉన్నప్పుడే సంపాదించుకోవాలి కదా. అదే చేస్తోంది ఈ భామ.

ఆమె తాజాగా “భూల్ భులయ్య 3” సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోంది. ఆమె “యానిమల్” చిత్రంలో నటించినందుకు 40 లక్షల రూపాయలు అందుకొంది. కానీ “భూల్ భులయ్య 3″కి ఆమె ఏకంగా దాదాపు కోటి రూపాయలు తీసుకుంటోంది అని టాక్.

అంటే ఆమె పారితోషికం ఒక్క సినిమా సక్సెస్ తో రెండింతలు అయింది. ఇకపై బాలీవుడ్ లో చేసే అన్ని సినిమాలకు ఎక్కువ పారితోషికం డిమాండ్ చెయ్యనుంది. ఇంకో రెండు హిట్స్ పడితే ఈ భామ రెండు కోట్లకు పైగా అందుకోవడం ఖాయం.

పారితోషికం పెంపు వార్తలపై తృప్తి స్పందించింది. “నా కన్నా మీడియాకే నా సంపాదన గురించి ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు ఉంది,” అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది. మరోవైపు ఈ భామని తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటింప చెయ్యాలని ఓ నిర్మాత భావిస్తున్నారు.

Advertisement
 

More

Related Stories