బాలయ్య సరసన మరోసారి త్రిష?

మణిరత్నం తీసిన ‘పొన్నియన్ సెల్వన్ 1’ తెలుగులో ఆడలేదు కానీ తమిళంలో మాత్రం అతిపెద్ద హిట్ గా నిలిచింది. అనేక సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. ఆ సినిమా విజయంతో త్రిషకి మళ్ళీ క్రేజ్ పెరుగుతోంది.

ఈ సినిమాలో త్రిష చాలా అందంగా కనిపించింది. ఆమె 40కి చేరువలో ఉంది. కానీ మణిరత్నం మాత్రం ఆమెని 30 ఏళ్ల యువతి లెవల్లో ప్రెజెంట్ చేశారు. దాంతో, ఆమెకి మళ్ళీ అవకాశాలు పెరుగుతున్నాయి. తెలుగులో కూడా దర్శకులు ఆమెకి ఆఫర్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తీస్తున్న సినిమాలో ఇంకా హీరోయిన్ ఎవరు అనేది ఫైనల్ కాలేదు. బాలకృష్ణకి కూతురుగా శ్రీలీల నటిస్తోంది ఇందులో. హీరోయిన్ విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఐతే, పొన్నియన్ సెల్వన్ చూశాక త్రిషని తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతానికి ఐతే ఆమెని అప్రోచ్ కాలేదు.

గతంలో త్రిష, బాలకృష్ణ ‘లయన్’ అనే సినిమాలో నటించారు కానీ అది ఆడలేదు.

 

More

Related Stories