
త్రిష పెద్ద మనసు చేసుకొని నటుడు మన్సూర్ అలీ ఖాన్ ని పూర్తిగా క్షమించేసింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని ఆమె పోలీసులను కోరింది.
“త్రిషను బెడ్ రూమ్ లోకి తీసుకుపొయ్యే ఛాన్స్” కూడా “లియో” దర్శకుడు సినిమా కథలో కల్పించలేదని వ్యాఖ్యానించిన మన్సూర్ అలీ ఖాన్ పై చర్యలు చేపట్టాలని ఇటీవల జాతీయ మహిళా కమిషన్ తమిళనాడు రాష్ట్ర డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పోలీసులు ఆయనని ఇప్పటికే విచారించారు. దానిలో భాగంగా తాజాగా త్రిష వివరణని అడిగారు. పోలీసులకు ఆమె రాతపూర్వక జవాబు ఇచ్చారు.
ఇప్పటికే మన్సూర్ క్షమాపణలు కోరినందున ఇక ఆయనపై చర్యలు చేపట్టొద్దని త్రిష పోలీసులని కోరింది. ఇంకా ఈ విషయాన్ని, మన్సూర్ ని వదిలేయాలని చెప్పింది.
“కుష్బూ, రోజా ఇలా పలువురు హీరోయిన్లను సినిమాల్లో రేప్ చేశాను. లియోలో నటించే ఛాన్స్ వచ్చినప్పుడు త్రిషను ని కనీసం ఎత్తుకొని బెడ్ రూమ్ కి తీసుకెళ్లే అవకాశం వస్తుంది అనుకున్నా,” అంటూ మన్సూర్ చేసిన కామెంట్స్ జాతీయస్థాయిలో రచ్చ రేపాయి.